|| విశిష్ట ధ్యాన శ్లోకములు ||
గణాధిపతిని వర్ణించు పద్యము
అంకముజేరి
శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్
కబళింపబోయి ఆ వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా ళాంకురశంక
నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్.
సరస్వతీ దేవి శ్లోకములు
శ్లో|| పంచాశల్లిపిభిర్విభక్త ముఖదో: పన్మధ్య వక్షస్థలాం
భాస్వన్మౌలి నిబద్ధ చంద్ర శకలామాపీన తుంగస్తనీం
ముద్రామక్షగుణం సుధాఢ్యకలశం విద్యాం చ హస్తామ్బుజై:
బిభ్రాణాం విశదప్రభాం త్రినయనాం వాగ్దేవతామాశ్రయే ||
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సిత తామర సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడుగల్గు భారతీ!
త్రిమూర్తులను వర్ణించు శ్లోకము
రచన: నన్నయ్య
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే ||
నవగ్రహ ధ్యాన శ్లోకములు
శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:
భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |
సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:
దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||
శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |
శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||
అథవా నిష్కలం ధ్యాయే త్సచ్చిదానంద లక్షణమ్ ||
తంత్రసార:
स्त्री रूपाम् चिन्तये द्देवीं पुंरूपं वा विचिन्तयेत
अथवा निष्कलं ध्याये त्सच्छिदानन्द लक्षणं ॥
तन्त्रसार :
No comments:
Post a Comment